గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తా….సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ యాదవ్…గెలిపించిన ప్రజల కోసం సేవ చేస్తా… సర్పంచ్ అలేఖ్య శ్రీనివాస్….ప్రమాణ స్వీకారం చేసిన నూతన సర్పంచ్,పాలకవర్గం…

 

 

ఎడపల్లి,డిసెంబర్ 22: (ప్రజా గళం)

ఠాణాకలాన్ గ్రామ అభివృద్దే ధ్యేయంగా తాను పని చేస్తానని,ఆ గ్రామ నూతన సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ యాదవ్ అన్నారు.సోమవారం నూతన సర్పంచ్ అలేఖ్య శ్రీనివాస్,ఉప సర్పంచ్ చితల రవి, వార్డు సభ్యులు అట్టహసంగా ప్రమాణ స్వీకారం చేశా రు.అనంతరం సర్పంచ్ అలేఖ్య శ్రీనివాస్,పాలకవర్గ సభ్యులు నూతన బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తనని గెలిపించిన ప్రజల కోసం సేవచేస్తానని ఆమె స్పష్టం చేశారు.గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం పని చేస్తానని,కుల మతా లకు,రాజకీయా పార్టీలకు అతీతంగా పని చేస్తానని అన్నారు.సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ అన్నారు. ప్రజలు తనపై నమ్మకంతో ఎన్నుకున్నందున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్ల పాలనలో గ్రామంలో వీధిలైట్లు,మంచినీటి సౌకర్యం ఏర్పాటు,సిసి డ్రైనేజీలు,సిసి రోడ్లు,నిర్మాణ పనులు చేసేందుకు పాల కవర్గం సహకారంతో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు..గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కార దిశగా పనిచేస్తామని స్పష్టం చేశారు.అనంతరం సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ ను అధికారులు,నాయకులు,గ్రామ పెద్దలు,తదితరులు పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి,ఆర్ఐ జయప్రకాష్,కార్యదర్శి రంజిత్,సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.