బాన్సువాడ, డిసెంబర్ 22, ప్రజా గళం.
బాన్సువాడ మండలం బుడిమి గ్రామ సర్పంచ్‌గా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన కమ్రుద్దీన్‌ను కాంగ్రెస్ యువ నాయకుడు ఎండి గౌస్ ఘనంగా సత్కరించారు. సోమవారం గ్రామంలో నిర్వ హించిన సర్పంచ్ పదవి బాధ్యతల స్వీకరణ కార్య క్రమంలో ఎండి గౌస్ తోటి నాయకులతో కలిసి పాల్గొని నూతన సర్పంచ్‌కు అభినంద నలు తెలిపారు.ఈ సందర్భం గా కమ్రుద్దీన్‌కు పూలమాలలు వేసి,శాలువాలతోసత్కరించారు.గ్రామ ప్రజల విశ్వాసంతో భారీ మెజార్టీ సాధించడం కమ్రుద్దీన్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఎండి గౌస్ పేర్కొన్నారు. బుడిమి గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల మెరుగుదలలో సర్పంచ్ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. యువత, రైతులు, మహిళల సమస్య లపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాన్ని ఆదర్శపంచాయతీగా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.స్థానిక రాజకీ యాల్లో బుడిమి పంచాయతీ ఫలితం ప్రాధాన్యతను సంత రించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిక మెజార్టీతో గెలుపు సాధించడం వల్ల నూతన సర్పంచ్‌పై ప్రజల ఆశలు మరింత పెరిగాయని, వాటిని నెరవేర్చే బాధ్యత ఇప్పుడు కమ్రుద్దీన్‌పై ఉందని వారు పేర్కొంటున్నారు. గ్రామ అభి వృద్ధిలో పాలకవర్గం, నాయ కులు, అధికారులు సమన్వ యంతో పనిచేస్తే బుడిమి గ్రామం మరింత ముందుకు సాగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

