సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన జ్యోతి ప్రకాష్

బాన్సువాడ, డిసెంబర్ 24 ప్రజా గళంః బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామ సర్పంచ్ గా బోనేకర్ జ్యోతి ప్రకాష్ పదవి భాద్యతలు స్వీకరించారు. బుదవారం ప్రమాణస్వీకార మహోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గా బోనేకర్ జ్యోతి, ఉపసర్పంచ్ గా పండరి గౌడ్, వార్డ్ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ భోనేకర్ జ్యోతి ప్రకాష్ కు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజెస్తూ, విభేదాలకు తావివ్వకుండా ఎల్లవేళలా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామాభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి శారిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.