ఎడపల్లి,డిసెంబర్ 27: (ప్రజా గళం)
వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళి కతో చర్యలు చేపడుతున్నట్లు జాన్కంపేట్ ఉపసర్పంచ్ అగ్గు కృష్ణ తెలిపారు.పంచాయతీ కార్యదర్శి సందీప్, వార్డు సభ్యురాలు కోడెల లక్ష్మీతో కలిసి అయన గ్రామం లోని పలు వార్డుల్లో పర్యటించి తాగునీటి వనరులను పరిశీలించారు.గ్రామంలో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న బోరుబావులను గుర్తించి,వాటిని తిరిగి ఉపయో గంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నా మని అన్నారు.గత పాత మోటార్లను తొలగించి,అవస రమైన మరమ్మత్తులు చేయిస్తామని తెలిపారు.రాను న్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా వార్డులలో నీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తామని ఉపసర్పంచ్ అన్నారు.గ్రామ శివా రులోని నర్సరీని సందర్శించి వారు మొక్కల పెంపకా న్ని పరిశీలించారు.గ్రామాన్ని పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా పని చేయాలని,మొక్కల సంరక్షణలో సిబ్బం ది ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్య క్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉప్పు జయరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.

