ఎరువుల గోడౌన్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలి….జానకంపేట్ లో ఎన్డిసిసిబి బ్యాంక్ ఏర్పాటు చేయాలి…రాష్ట్ర మంత్రులను కలిసిన విన్నవించిన జాన్కంపేట్ సొసైటీ తాజా మాజీ చైర్మన్ మిద్దె నరేందర్

 

ఎడపల్లి,డిసెంబర్ 29: (ప్రజా గళం)

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని సహకార సంఘాని(సొసైటీ)కి ఎరువుల గోడౌన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అలాగే గ్రామంలో నిజామాబాద్ ఎన్ డిసిసిబి బ్యాంక్ ఏర్పాటు చేయాలని గ్రామ సహకార సంఘం తాజా మాజీ చైర్మన్ మిద్దె నరేందర్ సోమవారం హైదరాబాద్ లోని పలువురు మంత్రులను కలిసి వినతిపత్రాలను అందజేశారు.మాజీ సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర సహకా ర శాఖ మంత్రి.తుమ్మల నాగేశ్వర్ రావుని ఇల్లందు సీని యర్ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆధ్వర్యంలో కలిశారు.ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వార రావు సానుకూలంగా స్పందించారని,జానకంపేట్ గ్రామంలో ఎన్డిసిసిబి బ్యాంక్ ఏర్పాటు కొరకు,అలాగే ఎరువుల గోడౌన్ నిర్మాణం కొరకు నిధులు మంజూరుకి కృషి చేస్తానని హామీ ఇచ్చారని సొసైటీ మాజీ చైర్మన్ మిద్దె నరేందర్ తెలిపారు.అలాగే మధ్యాహ్నం సెక్రెటేరి యేట్ లోని మినిస్టర్ ఛాంబర్ లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని,కూడా మిద్దె నరేంద ర్ కలిసి వినతిపత్రం అందజేశారు.సొసైటీకి వేబ్రిడ్జి నిర్మాణం కొరకు ప్రభుత్వం ఖాళీ స్థలాన్ని కేటాయించా లని,ఆఫీసు బిల్డింగ్ నిర్మాణం కొరకు నిధులు మంజూ రు చేయాలని అయన మంత్రికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు.ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సానుకూలంగా స్పందించి సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని జాన్కంపేట్ సొసైటీ తాజా మాజీ చైర్మన్ మిద్దె నరేందర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.