బాన్సువాడ, డిసెంబర్ 30 ప్రజాగళంః పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఉత్తర ద్వార దర్శనంతో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేదాశిర్విచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి అనుగ్రహంతో ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాష్కర్ రెడ్డి, స్థానిక నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

