నందిపేట్ జనవరి 3 , ( ప్రజాగళo)
నందిపేట్ మండలం తల్వేద గ్రామ వాగులో ఓ మహిళను దారుణంగా హత్య చేసి పడేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజ్ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
నందిపేట్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన రాగల గంగామణి( 40 )సంవత్సరాల వయస్సు గల మృతదేహం తల్వేద గ్రామం వాగు లో పడిపోయి ఉండగా స్థానికులు చూసి ఒడ్డుకు చేర్చినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. మృతురాలికి తలపై బలమైన ఆయుధంతో కొట్టడం తో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో గంగామణి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసిందన్నారు.. మృతురాలి కూతురు రాగల మేఘన తన తల్లిని వారి గల్లీకి చెందిన స్వరూప, లావణ్య, ప్రేమల, ప్రేమల భర్త నరేష్ లు తన తల్లిని బాసరకు తీసుకువెళ్లి నమ్మించి బలమైన ఆయుధంతో తలపై కొట్టి చంపి వేసినారని వారిపై అనుమానం ఉన్నదని ఫిర్యాదు ఇవ్వగా నందిపేట ఎస్సై హత్య కేసు నమోదు చేసి పరిశోధన చేస్తున్నారు. హత్య కేసులో నిందితులు పరార్ లో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు సిఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్సై శ్యామరాజ్ తెలిపారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

