ఎంఈవో ఫై దాడి చేసిన టీచర్ ఫై చర్యలు తీసుకోవా లి….ఎంఈవో గాలప్ప పోలీసులకు ఫిర్యాదు….

 

 

ఎడపల్లి,జనవరి 5: (ప్రజా గళం)

ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలోని ప్రైమరి పా ఠశాల విజిట్ కు వెళ్లిన మండల విద్యాధికారి శివలింగ్ గాలప్పఫై ఎస్ జిటి టీచర్ భూపతి రాజు అసభ్యంగా ప్రవర్తిస్తు విధులకు ఆటంకం పరిచాడని ఎడపల్లి ఎస్ఐ రమ తెలిపారు.ఆమె తెలిపిన కథనం ప్రకారం..సోమ వారం ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మండల విద్యాధికారి ఎంఈవో శివలింగ్ గాలప్ప తన విధులలో భాగంగా కుర్నాపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్ కు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాకేష్ తో కలిసి పాఠశాల పర్యవే క్షణకు వెళ్లాడు.ఆ పాఠశాలలో ఎస్ జిటి టీచర్ భూప తి రాజు విధులు నిర్వహిస్తున్నారు.ఈ పాఠశాల పర్య వేక్షణకు వెళ్లిన ఎంఈవో గాలప్పఫై టీచర్ భూపతి రా జు అసభ్యంగా ప్రవర్తిస్తూ విధులకు ఆటంకపరచు తూ,ఎంఈఓ యొక్క సెల్ ఫోన్ ను,రాకేష్ ఫోన్ ను తీసుకొని దౌర్జన్యంగా కింద పడవేసిశారని చెప్పారు.ఈ సందర్బంగా తమపై దాడికి పాల్పడ్డ టీచర్ భూపతి రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఈవో గాలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంఈ వో ఇచ్చిన ఫిర్యాదుఫై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.