బాన్సువాడ, జనవరి 5 ప్రజా గళంః బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గం మొదటి సమావేశం సోమవారం సర్పంచ్ భోనేకర్ జ్యోతి అద్యక్షతన నిర్వహించారు . ఈ సందర్భంగా సభ్యులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రధాన సమస్యలపై చర్చిస్తూ, గత పాలకవర్గ హాయాంలో గత ఐదు సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూం ఇళ్ల హౌస్ నెంబర్ కెటాయించకపోవడంతో ఈ సమస్యపై పాలకవర్గం చర్చించి రెండు సంవత్సరాల హౌస్ టాక్స్ కట్టిన వారికి హౌస్ నెంబర్ కెటాయించాలని , నూతనంగా ముగ్గురు పారిశుధ్య కార్మికులను నియమించాలని, తీర్మానం చేసారు. అనంతరం గ్రామాభివృద్ధి పనులు, త్రాగునీటి సరఫరా,
పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహన, పన్నులు వసూలు తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరగతిన పరిష్కరించేందుకు పాలకవర్గం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ పండరి గౌడ్, సెక్రటరీ గీత, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

