బాన్సువాడ, జనవరి 5, ప్రజాగళం.
బీర్కూరు మండలంలోని బరుంగేడిగి గ్రామంలో సోమవారం మురికి కాలు వల శుభ్రతా కార్యక్రమంనిర్వహించా రు.గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్,గ్రామకార్య దర్శి కార్య క్రమాన్ని దగ్గరుండి పర్య వేక్షించారు.గ్రామంలోని ప్రధాన వీధు లతో పాటు పలు వార్డుల్లో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి,పాడైన పదార్థాలను సిబ్బంది తొలగించారు.దీంతో నీరు సరిగా ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ,గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనితెలిపారు.పారిశుధ్యంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిం చమన్నారు.చెత్తను కాలువల్లో వేయకుండా నిర్దిష్ట ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు.గ్రామ కార్యదర్శి మాట్లాడుతూ,శుభ్రతా కార్యక్రమాలు నిరంతరం కొనసాగి స్తామని, గ్రామంలో ఆరోగ్యకర మైన వాతావరణాన్ని ఏర్పరచడమే లక్ష్య మని అన్నారు. కార్యక్రమంలో పారి శుధ్య సిబ్బంది, గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొని సహకారం అందించారు.

