బాన్సువాడ జనవరి 8 ప్రజాగళం.
బాన్సువాడ మండలం మొగులాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ పనులు వేగవంతంగా కొన సాగుతున్నాయి.ఇటీవల సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన కాట్రోతొ పూజారి, మొదటి నుంచే గ్రామంలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నారు.
ముఖ్యంగా గ్రామంలో పేరుకుపోయిన మురికి నీరు, చెత్త కారణంగా ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటుండటంతో, పారిశుద్ధ పనులను ప్రాధాన్య తగా తీసుకున్నారు. గురువా రం గ్రామంలోని పలు వాడల్లో డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేయించే పనులను సర్పంచ్ స్వయంగా పర్యవేక్షిస్తూ వేగం గా చేపట్టించారు.పారిశుద్ధ సిబ్బంది తక్కువగా ఉండటం తో అదనంగా కూలీలను నియమించి, డ్రైనేజీలు శుభ్ర పరచడం, మురికి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుం టున్నారు.ఈ చర్యల వల్ల గ్రామంలో పరిశుభ్రత మెరుగు పడుతూ, దోమలు మరియు వ్యాధుల వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొం టున్నారు.గ్రామాన్ని పరిశుభ్రం గా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్ద డమే తమ లక్ష్యమని సర్పంచ్ కాట్రోతొ పూజారి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో ప్రారంభమైన ఈ పారిశుద్ధ చర్యలు గ్రామస్థుల్లో సంతో షాన్ని కలిగిస్తున్నాయి. అభివృ ద్ధి దిశగా గ్రామం ముందుకు సాగుతుందనే నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

