నిజామాబాద్ జనవరి 9 ( ప్రజా గళం ప్రతినిధి )
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో సీ పి జట్టు విజయం సాధించింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ జట్టు వర్సెస్ ప్రెస్ లెవెన్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్

సాయి చైతన్య ప్రారంభించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పోలీస్ కమిషనర్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 132 పరుగులు సాధించింది. సీ పి జట్టులో ముప్కల్ ఎస్సై కిరణ్ కుమార్ 96 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి 35 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 133 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ప్రెస్ లెవన్ జట్టు 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులు సాధించి పరాజయం పాలయ్యారు. పోలీస్ జట్టు లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మూడు ఓవర్ వేసి మూడు కీలకమైన వికట్లు తీసి పోలీస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధాన ఉత్సవంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. పోలీస్ కమిషనర్ జట్టు నుండి బెస్ట్ బ్యాట్స్మెన్ గా ముప్కాల్ ఎస్సై కిరణ్ కుమార్ బహుమతి అందుకున్నారు.

ప్రెస్ లెవన్ లో అద్భుత బౌలింగ్ ప్రతిభ కనబరిచిన ఈనాడు క్రైమ్ రిపోర్టర్ శ్యామ్ ఉత్తమ బౌలర్ గా బహుమతి అందుకున్నారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వా రెడ్డి, ఏసీపి రాజా వెంకట్ రెడ్డి, సిఐలు, ఎస్సై లతోపాటు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

