ఎడపల్లి,జనవరి 14: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రా మంలో సంక్రాంతి పండగ వేడుకల్లో భాగంగా బుధవా రం బోగి పండుగ గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించా రు.ఉదయం బోగి మంటల కోసం ఆవు పేడతో తయా రు చేసిన లక్ష పిడకలతో దండ ను తయారు చేసి గ్రామ స్తులు భుజానా వేసుకొని తీసుకొచ్చి గ్రామం మధ్యన వెలిగించిన బోగి మంటల్లో వేసి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చా రణాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక చోట పేర్చిన కట్టెలను వెలిగించి అందులో ఆవు పేడతో తయారు చేసిన లక్ష పిడకల దండను బోగి మంటల్లో వేసి బోగి పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో వేడుకలను జరుపుకున్నారు.గ్రామ ప్రజలు ఈ బోగి మంటలు కాచుకుంటూ సంతోషం,ఆనందం వ్యక్తం చేశారు.

