వ్యక్తిపై తేనేటీగల దాడి…పరిస్థితి విషమం…సకాలంలో స్పందించి అస్పత్రికి తరలించిన 108 సిబ్బంది..అభినం దించిన వైద్యులు,కుటుంబ సభ్యులు…

 

 

ఎడపల్లి,జనవరి 21: (ప్రజా గళం)

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన జడగల గంగారాం అనే వ్యక్తిపై బుధవారం తేనెటీగలు దాడి చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.వివరాల్లోకి వెళితే…ఎడపల్లి మండలం అంబం(వై)గ్రామానికి చెందిన గంగారాం కూరగాయల వ్యాపారం చేస్తూ బెల్లావ్ గ్రామానికి చేరుకున్నాడు.అక్కడ తనపై తేనెటీగలు ఒక్క సారిగా దాడి చేయడంతో పరిస్థితి విషమంగా మారింది.

స్థానికులు 108 ఆంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా, అక్కటికి చేరుకున్న ఎడపల్లి 108 సిబ్బంది లక్ష్మణ్ ఆసిఫ్ లు ప్రథమ చికిత్స చేసి బోధన్ ఏరియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తులించారు.సకాలంలో స్పందిం చిన 108 సిబ్బందిని వైద్యులు,కుటుంబ సభ్యులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.