ఎడపల్లి,జనవరి 24: (ప్రజా గళం)
ఎడపల్లి మండల కేంద్రంలో నెల కొన్న విద్యుత్ సమస్య విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో స్థానిక సర్పంచ్ కందగట్ల రాంచందర్(అన్నాసేట్) పరిష్కరించారు. ఎడపల్లి గ్రామంలోని 7వ వార్డ్,అలాగే 3వార్డ్ లో ఉన్న కరెంట్ సమస్యలను స్థానిక సర్పంచ్ కందగట్ల రాంచం దర్ ఎఈ కిషోర్ రెడ్డి,లైన్ మెన్ రొట్టె పవన్ కుమార్ ల ఆధ్వర్యంలో వార్డులలో కొత్త స్తంభాలను వేసి సమస్య ను పరిష్కారించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యడు బర్దిపూర్ విఠల్,నాయకుడు మల్లెపూల శ్రీనివాస్,లైన్ మెన్ పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.

