బోధన్ మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ చేస్తాం…..జాగృతి నాయకుల వెల్లడి

బోధన్ ప్రతినిధి,జనవరి 24 : (ప్రజా గళం)
రాబోయే బోధన్​ మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపు న పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకుడు రజాక్​ తెలిపారు.ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.బోధన్ మున్సిపాలిటీలో ఉన్న 38 స్థానా ల్లోనూ తమ అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఎవరైనా తమ పార్టీ నుంచి పోటీ చేయదలుచుకున్న వారు తమను సంప్రదించాలని కోరారు.జాగృతి నుంచి పోటీ చేయదలచిన వారికి ఎన్నికల కమిషన్​ సింహం గుర్తు కేటాయించిందన్నారు. ఈ సమావేశంలో నాయ కులు ప్రవీణ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.