ఎన్నికల్లో సర్పంచ్ పోటీ కోసం ముగ్గురు పిల్లలు అడ్డు.. మహారాష్ట్ర నుండి ఎడపల్లి మండలానికి తీసుకొచ్చి కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి….నిందితులు ఇద్దరు అరెస్ట్ రిమాండ్…. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి….కేసును చేదించిన, సిఐ,ఎస్ఐలు,సిబ్బందిని అభినందిస్తూ రివార్డు అందిం చిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య….

ఎడపల్లి,ఫిబ్రవరి 2 : (ప్రజా గళం)

మహారాష్ట్ర రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికల సందర్బంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గు రు పిల్లలు ఉండటంతో అనర్హత పోవాలని,పథకం ప్రకారం.. మహారాష్ట్ర నుంచి కన్న కూతురిని కిడ్నప్ చేసుకొని వచ్చి తన ద్విచక్ర వాహనం ఫై ఎడపల్లి మండలానికి తీసుకొచ్చి కన్న కూతురిని కాలువలోకి తోసి చంపిన దారుణ విషాద ఘటన ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..బాలికను చంపిన తండ్రితో పాటు మరొకరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.ఈ సందర్బంగా ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య e వెల్లడించారు.జనవరి 29న ఎడపల్లి మండలం ఎ.ఆర్.పి క్యాంపు శివారు లోని నిజాంసాగర్ కెనాల్ (డి-46/8)లో సుమారు 6 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది.పోలీసులు కేసు నమోదు చేసి,బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు.చిన్నారి ఫోటోను సోషల్ మీడియా,వాట్సాప్ గ్రూపులలో విస్తృతంగా

ప్రచారం చేశారు.ఈ క్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన పిసి-630 సుధీర్ తన వాట్సాప్ స్టేటస్ లో ఉంచిన ఫోటోను మహారాష్ట్రలోని ముఖేడ్ గ్రామస్థులు గుర్తించి,ఆ పాప ప్రాచి కొండమంగలే అని పోలీసులకు సమాచారం అందించారు.ఈమేరకు పోలీసుల విచా రణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.మహారా ష్ట్రలోని నాందేడ్ జిల్లా,ముఖేడ్ తాలూకా కెరూర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.అయితే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేయా లని అతను ఆశపడ్డాడు.నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అవుతారు.దీనిపై ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి చర్చించిన పాండురంగ,తన ముగ్గురు పిల్లలలో ఒకరిని తక్కువ చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పథకం వేశాడు.మొదట ఒక బాబు బర్త్ సర్టిఫికేట్ మార్చేందు కు పూణే వెళ్లినా అది సాధ్యం కాదని తేలింది.దీంతో ఒక బిడ్డను చంపేసి తప్పిపోయినట్లు నమ్మించాలని నిర్ణయించుకున్నారు.పథకం ప్రకారం..తండ్రి పాండు రంగ తన పెద్ద కూతురు ప్రాచిని బైక్ పై మాయమాట లు చెప్పి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలానికి తీసుకువచ్చాడు.మండలంలోని దుబ్బా తాండా గ్రామ సమీపంలో అక్కడ ఎవరూ లేని సమయం చూసి,పాప బ్రతికి ఉండగానే ప్రాచి ని డి-46 నిజాంసాగర్ కాలువ లోకి తోసివేసి పరారయ్యాడు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ కేసు చాకచక్యంగా చేదించిన బోధన్ ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూరల్ సి.ఐ.విజయ్ బాబు,ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ,రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్,బాబురావు,ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్బం గా ఎడపల్లి,రెంజల్ ఎస్ఐ లు ముత్యాల రమ,చంద్ర మోహన్,ఎఎస్ఐ బాబు రావు,సిబ్బంది సుధీర్,శ్రీకాంత్ లకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రివార్డ్ లను అందజేశారు.ఈ సమావేశంలో బోధన్ ఏసిపి పి.శ్రీనివా స్,బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు,ఎస్ఐ లు ముత్యాల రమ,చంద్రమోహన్,సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.