సర్పంచ్ జ్యోతి ప్రకాష్ కు సన్మానం..

 

బాన్సువాడ 24, ప్రజాగళం. బాన్సువాడ మండలం దేశాయ్ పేట గ్రామ సర్పంచ్ భువనేకర్ జ్యోతి ప్రకాష్ ను మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గ్రామంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సర్పంచ్ జ్యోతి ప్రకాష్ సతీ సమేతంగా విచ్చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆ దంపతులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని గౌడ సంఘ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులతో పాటు పలువురు గ్రామ పెద్దలుపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.