శాంతి ర్యాలీని విజయవంతం చేయండి. -మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

 

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 27( ప్రజాగళం )

 

నిజామాబాద్ నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ శనివారం శాంతి ర్యాలీ చేపట్టారు. గత కొంతకాలంగా అన్ని వర్గాలు ఒకటేనన్న నినాదంతో ధర్మపురి సంజయ్ ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ చేసిన నినాదం ఫలితాన్నిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కలయిక వెనుక ధర్మపురి సంజయ్ కృషి ఎంతగానో ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే శనివారం చేపట్టిన శాంతిర్యాలీకి భారీగా తరలి వచ్చి విజయవంతం చేసి ఐక్యతను చాటుకోవాలని ధర్మపురి సంజయ్ పిలుపునిచ్చారు. కుల మతాలు ముఖ్యం కాదని అభివృద్ధి మన లక్ష్యమని సంజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో

మన శాంతి మన బాధ్యత అనే నినాదంతో శాంతి ర్యాలీకి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పిలుపునిచ్చారు.ఈ నెల 28 వ తేదీన జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా జరిగే ఈ ర్యాలీలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.నేడు కులమత ఘర్షణలతో రాజకీయ పార్టీలు లబ్ది పొందాలని చూస్తున్నాయన్నారు. సర్వేజనో సుఖినోభవంతు, మేరాభరత్ మహాన్, హిందూ,ముస్లిం,సిఖ్, సిపాయి ఆపాస్ మే భాయ్ భాయ్ నినాదలు చేస్తూ ముందుకు సాగాలన్నారు. గతంలో దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ చేసిన అభివృద్ధినే తాను కోరుకుంటున్నానని, అలాంటి అభివృద్ధి జరగాలంటే కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యమంగా ముందుకు సాగాలన్నారు. తాను చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని నిజామాబాద్ ప్రజలను ధర్మపురి సంజయ్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.