ఎడపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

 

ఎడపల్లి,మార్చి 1: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలోని వివేకానంద(మంగల్ పాడ్ రోడ్డు)చౌరస్తా వద్ద శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఫై నుండి పడి సయ్యద్ మౌలా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.ఎడపల్లి 108 ఆంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది లక్ష్మణ్,సతీష్ లు ప్రథమ చికిత్స చేసి మెరు గైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.సయ్యద్ మౌలా బోధన్ మం డలం ఎరాజ్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని ఆంబు లెన్స్ సిబ్బంది లక్ష్మణ్ తెలిపారు.ప్రమాదానికి గల కారణాలు తెలియదని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.