సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకo తొందరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

 

నిజామాబాద్ మార్చి 9(ప్రజా గళం ప్రతినిధి)

 

సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. సాధ్య సాధ్యాలను పరిశీలించి తొందర్లోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల సమస్య ను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు.నగరంలోని బస్వా గార్డెన్‌లో నిజామాబాద్ అర్బన్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన బాధ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ,

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.

సమాజంలో నాలుగో స్తంభమైన జర్నలిజం వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు.

నిజామాబాద్ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగర జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఈ రోజే కలెక్టర్, ఆర్డీవోలతో సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నగర శివారులోని కేశపూర్ లో గల ప్రభుత్వ స్థలంను జర్నలిస్టులకు ఇచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు.

విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము గుర్తిస్తున్నామని, వారి ఆరోగ్య భద్రత (హెల్త్ కార్డ్స్) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.

వార్తల సేకరణలో వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, పేదల గొంతుకగా నిలవాలని ఆయన నూతన కార్యవర్గానికి సూచించారు.

టిఆర్పి రేటింగ్ గురించి , ఆలోచించకుండా వాస్తవాలు మాత్రమే వెలుగులోకి తీసుకురావాలని,

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు

పాత్రికేయుల పోరాట పటిమను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు.

ఒక నాయకుడు ఎదగాలన్న మీడియా

సహకారంతో ఎంతో అవసరమని,

ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వానికి వివరించడంలోనూ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు. కలుషితమవుతున్న కొందరు రాజకీయ నాయకులను గాడిలో పెట్టాల్సిన సంపూర్ణ బాధ్యత కేవలం మీడియాదేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీగా తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ , కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి రాజ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి బొత్స రాజు,జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.