బోధన్ ప్రతినిధి,మార్చి 10: (ప్రజా గళం)
బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లిలోని అప్నా ఫంక్షన్ హాల్ లో ముప్తి అతిక్ హైమద్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనం గా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మౌలానా సయ్యద్ అబ్దుల్ బాకీ నిర్వహించిన దువా లో సీపీ పాల్గొని అనంతరం ఉపవాస విరమణ చేశా రు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ..రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణా త్మకంగా వివరించారు.రంజాన్ అనేది కేవలం ఉపవా సాల నెల మాత్రమే కాకుండా,మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు.ఉపవా సం ద్వారా నియమం,సహనం,క్రమశిక్షణ పెంపొందు తాయని,పేదల పట్ల కరుణాభావం మరింత బలపడు తుందని పేర్కొన్నారు. దానధర్మాలు,సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు.అల్లా కృపతో సమాజంలో శాంతి,సౌభ్రాతృత్వం,సుఖసంతో షాలు నెలకొనాలని ఆకాంక్షించారు.అలాగే అన్ని వర్గా ల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి బోధన్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి. శ్రీనివాస్,సీఐలు వెంకటనారాయణ,విజయ్ బాబు, ఎస్ఐ లు మచ్చేందర్ రెడ్డి,భాస్కరాచారి,మనోజ్, మహేష్,హబీబ్,మజీద్ కమిటీ సభ్యులు ఎంఐఎం ప్రెసిడెంట్ మీర్ ఇలియాస్ అలీ,కౌన్సిలర్ ముషీర్ బాబా,అడ్వకేట్ అబ్బీద్ సుఫి,కౌన్సిలర్ మీర్ గౌస్, ఆసిఫ్ సుల్తాన్,మోల్ సాబ్,మహమ్మద్ ఇమ్రాన్, హుస్సేన్,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.సీపీ హాజరు కావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

