మహిళా ఎస్ఐ ని ఘనంగా సన్మానించిన పంచాయతీ పాలకవర్గం….ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయాలి…..

 

 

ఎడపల్లి,మార్చి 9: (ప్రజా గళం)

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ముత్యాల రమ తన తోటి మహిళా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపారు.ఈ సంద ర్బంగా ఎస్ఐ మాట్లాడు తూ..మహిళలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడు గు వేయాలని,పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించా లని ఆమె సూచించారు.మహిళలు సంకల్పిస్తే సాధించ లేనిది అంటూ ఏదీ లేదని అన్నారు.ఆత్మవిశ్వాసమే మన అసలైన ఆయుధమని ఎస్ఐ ముత్యాల రమ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ మచ్కూరి గంగాధర్,పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు పురం నాగశ్రీ,కందునూరి కృష్ణవేణి, మన్నూరు సునీత, ముస్తక్,కట్కం అరుణ్,గంగ ప్రసా ద్,బర్దిపూర్ విట్టల్,అంగన్ వాడి టీచర్లు,పంచాయతీ పాలకవర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.