బాన్సువాడ మార్చి 16 ప్రజాగళం.
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సంద ర్భంగా వారు కోరారు.ఇటీవల నస్రుల్లాబాద్ మండలంలోని జెడ్‌పిహెచ్‌ఎస్ బొమ్మన్ దేవ్‌పల్లి పాఠశాలలో ఎస్‌ఏ గణితం ఉపాధ్యాయుడిపై కక్షపూరితంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అదే విధంగా గత సంవత్సరం (2025) నిర్వహించిన SEEP సర్వేలో పాల్గొన్న ఉపాధ్యా యులకు ఇప్పటికీ గౌరవ వేతనం అందలేదని తెలి పారు.సంబంధిత ఉపాధ్యా యులకు వెంటనే గౌరవ వేతనం చెల్లించాలని కోరారు.
రాబోయేజనగణన–2026లో ఎస్‌జిటి ఉపాధ్యాయులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల ని, అందరికీ ఎన్యూమరేటర్ విధులు కేటాయించాలని సూచించారు.అలాగే ఎల్‌ఎఫ్ ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ ఎస్‌జిటి ఉపాధ్యాయులకు సూపర్వైజర్ డ్యూటీలు ఇవ్వాలని తెలిపారు.
కొన్ని సందర్భాల్లో అర్జిత సెలవులు లేని విధులను ఎస్‌జిటి ఉపాధ్యాయులకు కేటాయిస్తూ, అర్జిత సెలవులు ఉన్న విధులను నాన్ ఎస్‌జిటి ఉపాధ్యాయులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. డీఈఓ, ఎంఈఓలు ఏకపక్షంగా విధులు కేటాయిస్తూ ఎస్‌జిటిలకు రావాల్సిన అవకాశాలను దూరం చేస్తున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా డీఎస్ఓ పదవిలో ఉన్న అధికారి గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్నారని, నోటిఫికేషన్ జారీ చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరారు. ఏఎంఓ పోస్టుకు పరీక్ష రాసి అర్హత సాధించిన వారికి మాత్రమే ఏఎంఓ విధులు అప్పగించాలని సూచించారు.ఇటీవల జరిగిన పదోన్నతుల్లో రోస్టర్ కమ్ మెరిట్ ప్రక్రియలో అవకత వకలు జరిగాయని ఆరో పిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకొని రోస్టర్ కమ్ మెరిట్ సవరణ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యా య సంఘాల సమైక్య చైర్మన్ బొంద రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సోమిశెట్టి రాములు, పంపరి ప్రవీణ్ కుమార్, యాదయ్య, అయ్యాల సంతోష్, రాజేష్, ముజిబుద్దీన్, దేవుల ప్రభాకర్, శ్రీశైలం, రాజయ్య, తిరుపతి, ఖలీం, బాలయ్య, బాబన్న తదితరులు పాల్గొన్నారు.

