బోధన్ ప్రతినిధి,మార్చి 18: (ప్రజా గళం) నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించడంతో,చేతికొచ్చిన వరి పంట పూర్తి గా నేలపాలైంది.సాలూరా,రుద్రూర్,ఘన్‌పూర్ శివార్లతో పాటు లింగంపల్లి,చిక్కడపల్లి ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది.మరో పది రోజుల్లో కోతకు వస్తుందను కున్న వరి పంట,వడగండ్ల ధాటికి గింజలన్నీ రాలిపోయి ఒట్టి గడ్డి మిగిలింది.సుమారు 70 శాతం మేర పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.ఎకరాకు సుమారు 35 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని,ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 70 శాతం మంది కౌలు రైతులే సాగు చేస్తున్నారు.ఒక్కో రైతు 50 ఎకరాల వరకు కౌలు కు తీసుకుని సాగు చేయగా,ప్రకృతి ప్రకోపానికి వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి.”కుటుంబ అవసరాలు తీరుతాయనుకున్న తరుణంలో,వడగండ్లు మా జీవితా లపై బండరాయిలా పడ్డాయి”అని కౌలు రైతులు లభో దిభోమంటున్నారు.ప్రభుత్వం తక్షణమే వ్యవసాయాధి కారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచ నా వేయాలని రైతులు కోరుతున్నారు.కేవలం పట్టాదా రులకే కాకుండా,నష్టపోయిన కౌలు రైతులకు కూడా పూర్తిస్థాయిలో పరిహారం అందించి ఆదుకోవాలనిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

