ఎడపల్లి,మార్చి 20: (ప్రజా గళం)
ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ లోకల్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డల్లా సురేష్ మహాజన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీమంజుల సామిల్ ఇంటిపైన బిజెపి గుండాల దాడికి నిరసనగా శుక్రవారం నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డల్లా సురేష్ మహాజన్ మాట్లాడుతూ..బిజెపి రాష్ట్ర నాయకుల యొక్క ప్రవర్తనను ఎండగడుతూ బండి సంజయ్ వెంటనే మందుల సామెల్ కు క్షమాపణ చెప్పాలని… భవిష్యత్తులో మాదిగ ప్రజాప్రతినిలపై బిజెపి మత తత్వ ధోరణిలో దాడులు చేస్తామంటే మేము ముస్లిం సమాజం కాదు,మాదిగ సమాజం, తిరగబడి బిజెపి పార్టీని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపి తం చేస్తామని అన్నారు.ఒకవైపు బిజెపి పార్టీకి మందకృష్ణ మాదిగ మద్దతుగా ఉన్నారని మీరు భ్రమ ల్లో ఉంటే మాదిగ సమాజం అన్యాయాన్ని చూస్తూ ఊరుకోదు అని,దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా సమస్య లను పరిష్కరించాలి అంతేతప్ప దాడులు చేస్తామంటే ప్రతిదాడికి కూడా మాదిగ సమాజం సిద్ధంగా ఉంటుంద ని ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకత్వాన్ని హెచ్చ రించారు.ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు బుడ్డ పోశెట్టి మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు దొబ్బల సాయికుమార్,టిఎల్ఎఫ్ నాయ కులు వార్డు నెంబర్ సాయి చిరు,పి.రమేష్ మాదిగ, బాలరాజు మాదిగ,అజయ్ మాదిగ,బొప్పురం అబ్బు లు మాదిగ,బానపల్లి పోశెట్టి మాదిగ, సాయికు మార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

