25న అసెంబ్లీ ముట్టడి కి ఎన్సీపీ పార్టీ పూర్తి మద్దతు. జిల్లా అధ్యక్షుడు విట్టల్ మాలావత్ నాయక్ .

 

నిజామాబాద్ రూరల్ మార్చ్ 24 (ప్రజా గళం)

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్లో గిరిజనులకు ఒక పైసా కేటాయించకుండా అన్యాయం చేశారని విట్టల్ నాయక్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ బుధవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి ఎన్సిపి పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని జిల్లా అధ్యక్షుడు విఠల్ నాయక్ అన్నారు.2018 నుండి తీసుకున్న ట్రాక్టర్స్ , హార్వెస్టర్స్ ,కార్లు సబ్సిడీ డబ్బులు డిఐసి ద్వారా మంజూరయ్యాయని వాటిని డబ్బులు వేయడానికి చేతకావడం లేదని అలాగే నిరుద్యోగం పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకోవడం కొరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ అమౌంట్ 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ డబ్బులు రిలీజ్ చేయడానికి కూడా ధైర్యం లేదు వాటికి బడ్జెట్లో డబ్బులు కేటాయించే సత్తా భట్టి విక్రమార్క కు లేదన్నారు. టెన్ పర్సెంట్ డబ్బులు ఎవరి ఇస్తే వారికి సబ్సిడీ అమౌంట్ పడుతున్నాయని మరి పేదవాడి పరిస్థితి ఏంది…

రాజీవ్ యువ కిరణాలు ద్వారా అప్లికేషన్ చేస్తే అవి ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ఎవ్వరికీ ఒక యూనిట్ సాంక్షన్ అయిన దాఖలాలు లేవన్నారు.

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ డబ్బులు ఎక్కడికి పోయాయి ఏటు మళ్ళించారు దాన్ని అడిగే మంత్రులుగాని ఎమ్మెల్యేలు గాని బoజార జాతిలో లేకపోవడం దౌర్భాగ్యం

తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందన్నారు.

గతంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా చాలామంది నిరుపేదలకు లోన్స్ సాంక్షన్ చేసి వారికి ఇప్పటివరకు సబ్సిడీ డబ్బులు వేయలేదని,

ఇకనైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఏకమై కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి రానున్న ఎన్నికల్లో మన సత్తా చాటాలని, మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విట్టల్ నాయక్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.