ఎడపల్లి,మార్చి 25 : (ప్రజా గళం)
ఎడపల్లి మండలం ఏఆర్ పి క్యాంప్ గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్య మయ్యాడు.ఎస్ఐ ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం..ఏఆర్పి క్యాంప్ గ్రామానికి చెందిన గంగుల హనుమంతు(50)అనే వ్యక్తి ఈ నెల 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిజామాబాద్ లో లేబర్ ఆఫీస్ కి వెళ్లి లేబర్ కార్డు తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుండి వెళ్ళాడు.తిరిగి అయన ఇంటికి రాలేదు అని అన్నారు.రాత్రి అయినా కూడా ఇంటికి రాలేదని,అన్ని చోట్ల వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు అన్నారు. హనుమంతు ఫోన్ కు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని భార్య ముద్దాంగుల ఎంకమ్మ తెలిపింది.దింతో బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితురాలు ఎంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

