గ్యాస్ కృత్రిమ కొరతపై వెంటనే చర్యలు తీసుకోవాలి — RSP డిమాండ్

 

నిజామాబాద్,ఏప్రిల్ 01,ప్రజాగళం సిటీ:

 

ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలపై పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పేద ప్రజలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సాధారణ ప్రజలు వారాల తరబడి గ్యాస్ కోసం ఎదురుచూస్తుంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ రెస్టారెంట్లు, హోటళ్లకు మాత్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు విచ్చలవిడిగా అందుతున్నాయని ఆయన ప్రశ్నించారు.

గ్యాస్ ఏజెన్సీలు మరియు సప్లయర్లు పేద ప్రజలకు సమయానికి సిలిండర్లు అందించకుండా బ్లాక్ మార్కెట్‌లో రూ.2000 నుండి రూ.3000 వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

గ్యాస్ ధరలు పెరగడంతో కూరగాయల ధరలు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు, హోటళ్లలో భోజనాల ధరలు పెరిగి సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతోందని తెలిపారు. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెప్పినా పరోక్షంగా కొరత ఉన్నట్లు పరిస్థితులు స్పష్టంగా చూపుతున్నాయని అన్నారు.

అందువల్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని పేద ప్రజలకు సమయానికి గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు చేపట్టాలని RSP పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో RYF జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, RSP నాయకుడు సయ్యద్ రఫీ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.