ఎడపల్లి వీక్లీ మార్కెట్ కు వేలం పాట…రూ:5.88 లక్షల కు దక్కించుకున్న కాంట్రాక్టర్ మహమ్మద్ మజారుద్దీన్

 

ఎడపల్లి,ఏప్రిల్ 8: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయ తీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ కందగట్ల రాం చందర్ అధ్యక్షతన వారాంతపు సంతను వేలం పాట నిర్వహించారు.గత నెల 25న వారంతపు సంతకు వేలం పాట నిర్వహించగా,వేలం పాటలో వీక్లీ మార్కెట్ ను స్థానిక మన్నూర్ మోహన్ 8.24 లక్షలకు దక్కించు కున్నారు.అయితే వీక్లీ మార్కెట్ వేలం పాట పాడిన సదరు వ్యక్తి చెల్లించవల్సిన డబ్బులు సకాలంలో చెల్లిం చక పోవడం వల్ల వేలం పాట రద్దు చేశారు.దింతో తిరిగి గ్రామ పంచాయతీలో బుధవారం అంగడి బజార్ కు వేలం పాట నిర్వహించారు.పలువురు వ్యాపారులు వేలం పాటలో పాల్గొని పోటీ పడ్డారు.ఈ వేలం పాటలో పాల్గొన్న నవీపేట్ గ్రామానికి చెందిన మహమ్మద్ మజా రుద్దీన్ అనే కాంట్రాక్టర్ 5,88 లక్షలకు వీక్లీ మార్కెట్ ను దక్కించుకున్నారు.ఈ వేలం పాట కార్యక్రమంలో సర్పంచ్ కందగట్ల రాంచందర్,ఉపసర్పంచ్ మచ్కూరి గంగాధర్,కార్యదర్శి నాగరాజ్ గౌడ్,వార్డు సభ్యులు నాగరాణి,అరుణ్,బర్దిపూర్ విట్టల్,శంకర్,ముస్తాక్, సయ్యేద్ ఇసాక్,స్థానిక నాయకులు మల్లెపూల శ్రీనివా స్,నాయిని లక్ష్మణ్ గౌడ్,సదానంద్, డి.గంగాధర్,ప్రతాప్ రెడ్డి, వ్యాపారస్తులు లచ్చాగౌడ్, అంజాద్,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.