నిజామాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా గళం ప్రతినిధి)
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
నిజామాబాద్ నగరంలోని కంరేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను సందర్శించి వసతులను పరిశీలించారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి

తెలుసుకున్నారు. ప్రజలకు పూర్తి పారదర్శకంగా, సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇంచార్జి రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

