బోధన్ ప్రతినిధి,ఏప్రిల్ 9: (ప్రజా గళం)
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ను చేర్పించాలని కోరుతూ బోధన్ పట్టణంలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గురువారం పట్టణంలోని రాకాసిపేట్ లో ఇంటింటికి తిరుగుతూ పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిలకు ఉచిత విద్యాబోధనతో పాటు కలిపిస్తున్న వసతులను వివరిం చారు.ఈ కార్యక్రమంలో వెంకట్,శ్రీకాంత్,కిషన్ లు విద్యార్థుల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

