బోధన్‌లో ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు…. ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి న అధికారులు….

 

 

బోధన్ ప్రతినిధి,ఏప్రిల్ 16: (ప్రజా గళం)

ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బోధన్ పట్టణంలో అగ్నిమా పక శాఖ కేంద్రాధికారి సుభాష్‌ ఆధ్వర్యంలో అగ్నిమా పక వారోత్సవాలు ప్రారంభించారు.అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు..ప్రస్తుతం మండుతున్న వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటా యి.ఈ వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలకు కారణాలు,నివారణ చర్యలు,అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.అంబేద్కర్ లో చౌరస్తాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొని పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎస్ఐ భాస్కరాచారి,విజయ సాయి హై స్కూల్ నిర్వా హకులు చక్రవర్తి ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరిం చారు.అనంతరం బోధన్ బస్టాండ్‌లో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్ష విన్యాసాలు నిర్వహించి అగ్ని ప్రమా దాల సమయంలో స్పందించే విధానాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంతో పాటు సిబ్బంది పాల్గొని అప్రమత్తతతో ఉంటే ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవ చ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో విజయసాయి పాఠశాల విద్యార్థులు,పోలీస్ శాఖ సిబ్బంది,అగ్ని మాపక కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.