ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి.

నిజామాబాద్ రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా గళం)

 

 

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

టీజీఈ -జేఏసీ పిలుపు మేరకు మోపాల్ మండల తరపున తహసిల్దార్ కు ఉద్యోగస్తుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యూ మోపాల్ మండల అధ్యక్షులు కొట్టూరు దేవిదాస్ మాట్లాడారు. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశామని, వారిద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం చేరే విధంగా స్పందించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు భోజన విరామ సమయంలో తమ నిరసనను వ్యక్తం చేశారని ఈ సందర్భంగా దేవిదాస్ తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించి సక్రమంగా అమలు అయ్యేటట్టు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వ మాత్రం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మండల పి ఆర్ టి యూ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ , రాష్ట్ర బాధ్యులు వెంకటేష్ గౌడ్, మద్దినేని శ్రీనివాస్ ,మాధవి , మహేందర్ ఎండల , మండల్ బాద్యులు కడాత్ గోపాల్ , చంద్రు,నవనీత , పి ఆర్ టి యూ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.