ఎడపల్లి,ఏప్రిల్ 17: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం హిందూ సమ్మేళనం కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ బంధువులు తెలిపా రు.ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ పిఠాధిపతి శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ ను సాదారంగా ఆహ్వానిస్తూ,అయన ఆశీస్సులతో చేతుల మీదుగా ఆహ్వానం పత్రాన్ని ఆవి ష్కరణ చేయించడం జరిగింది అని ఎడపల్లి గ్రామ హిందూ బంధువులు తెలిపారు.ఈ పవిత్ర హిందూ సమ్మేళనం సందర్బంగా హిందూ సమాజ ఐక్యతకు, ధార్మిక చైతన్యానికి నాందికావాలని పిట్ల కృష్ణ మహా రాజ్ స్వామి పిలుపునిచ్చారు.ఆహ్వాన పత్రాన్ని అందించిన వారిలో ఆకుల శ్రీనివాస్,ఆత్మేల శ్రీనివాస్, జక్కలి నగేష్,అరుణ్,గంగ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

