ఎడపల్లిలో టిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ దిష్టి బొమ్మ దహనం…..

 

ఎడపల్లి,ఏప్రిల్ 18 : (ప్రజా గళం)

కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్ల మెంట్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎడపల్లి మండల కేంద్రంలో టిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం ఆయన దిష్టిబొమ్మను దాహనం చేశారు.ఈ సందర్భంగా టిఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డల్లా సురేష్ మాట్లాడుతూ..తేజస్వీ సూర్య తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండడం సిగ్గు చేటని అన్నారు.ఈ సందర్బంగా యావత్ తెలం గాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సాయి చిరు,నాయకులు శ్రీధర్ గౌడ్,శ్రీకాంత్,ప్రసాద్, గణపతి,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.