జైతాపూర్ గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ నాగుల రాజు గౌడ్…వేసవి ఎండల్లో చల్లని నీరు దాహర్తిని తీరుస్తుంది….. సర్పంచ్ వెల్లడి…

 

 

ఎడపల్లి,ఏప్రిల్ 21: (ప్రజా గళం)

ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో సర్పంచ్ నాగుల రాజు గౌడ్ మంగళవారం చలివేంద్రాన్ని ప్రా రంభించారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వేసవి ఎండలు మండుతున్నాయని,గ్రామంలో పనుల నిమిత్తం బయటకు వెళ్లే పాదచారులకు దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగ పడు తుందని అన్నారు.ఉక్కపోత,గొంతు ఎండిపోయి దాహం వేసే పాదచారులకు చల్లని నీరు దప్పిక తీరు స్తుందని తెలిపారు.ప్రతి ఒక్కరు చల్లని నీటి కోసం చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ నాగుల రాజు గౌడ్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భార్గవ్,కార్యదర్శి నగేష్,పాలకవర్గ సభ్యులు, ఆత్మ చైర్మన్ కృష్ణారావు,జైతాపూర్ గ్రామ స్వచ్చంద సేవ సంస్థ సభ్యులు,యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు అఖిలేష్ గౌడ్,గ్రామ పెద్దలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.