ఎడపల్లి,ఏప్రిల్ 23 : (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో రాపెన్ చిన్న సాయిలు అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకా రం..జాన్కంపేట్ గ్రామానికి చెందిన రాపెన్ చిన్న సాయి లు పనిపాట లేక జులయిగా తిరిగే వాడని,చెడు వ్యస నాలకు అలవాటు పడి విపరీతంగా మద్యానికి బానిస య్యాడని తెలిపారు.చేసిన అప్పులు చేసి అప్పులు కట్టలేక మనస్తాపం చెంది జీవితం పై విరక్తి చెంది రాపెన్ చిన్న సాయిలు ఇంటి పక్కన ఉన్న బాత్ రూం లోని సీలింగ్ కు మంచం నవారాతో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. మృతుడి భార్య రాపెన్ రాధ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమ తెలిపారు.

