నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 26(ప్రజాగళం)
సమాజంలో తమ వంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం దివ్యాంగులు, ఇతర సమాజ హిత కార్యక్రమాలకు నూతన ఒరవడితో శ్రీకారం చుడుతూ ముందుకొస్తున్న స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి సిద్దయ్యలు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని స్నేహ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మహిపాల్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సవితా రాణి కొనియాడారు. వారు చేసిన సేవలో మేము, సిబ్బంది సైతం ఒక సమిద కావడం ఎంతో సంతృప్తినిస్తుందని వారు పేర్కొన్నారు. వారిపై భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని వారు ఆకాంక్షించారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ 34వ సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్నేహ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఎం మహిపాల్ , వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సవితారాణి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య పాల్గొన్నారు.. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య స్నేహ సొసైటీ ఏర్పడిన నాటి నుండి అందిస్తున్న సేవలను, ఎదుర్కొన్న ఒడిదుడుకులను అలాగే

ప్రోత్సాహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగం అందిస్తున్న ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరించారు. 2025- 26 సంవత్సరంలో ఆదాయం , ఖర్చులు ఇతర ఇతర విషయాలను తెలియజేశారు.. అలాగే ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో పాటు గత కలెక్టర్లు డాక్టర్ యోగితా రానా, ఇతర అధికారుల ప్రోత్సాహంతో దివ్యాంగుల అభ్యున్నతికి తమకు సహకారం అందించడం జరిగిందన్నారు.. అంధ విద్యార్థులకు నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించడం పట్ల స్నేహ సొసైటీ పాఠశాల అధ్యక్షులు డాక్టర్ మహిపాల్ స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి ఎస్ సిద్దయ్య లను ప్రత్యేకంగా అభినందించారు.. ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ ప్రతి ఒక్క సిబ్బంది సహకారంతోనే స్నేహ సొసైటీ ఎంతోమంది దివ్యాంగుల ఉన్నతి సాధ్యమవుతుందన్నారు. నిజామాబాద్ మంచిర్యాల ,బైంసాలలో స్నేహ సొసైటీ సేవలు అందించడం జరుగుతుందన్నారు.. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం స్నేహ సొసైటీ సంస్థలో ఉన్న సిబ్బంది అందరితో కలిసి ఒక కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటుచేసి సరుకులను తక్కువ ధరకు సిబ్బందికి అందించే విధంగా శ్రీకారం చుట్టేందుకు మరో ముందడుగు వేసినందుకు స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్యను డాక్టర్ సవిత రాణి, స్నేహ సొసైటీ కమిటీ సభ్యులందరూ అభినందించారు.. ఇంతటి మంచి అవకాశాన్ని స్నేహ సొసైటీ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. అలాగే ఏదైతే కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసేందుకు తమ వంతు సహకారాలు అందజేస్తామని అతి తక్కువ ధరలో సరుకులను ఇప్పించే విధంగా కృషి చేస్తామని స్నేహ సొసైటీ కమిటీ సభ్యులు సభ ముఖంగా తెలిపారు. స్నేహ సొసైటీ దివ్యంగుల ఉన్నతి కోసం డాక్టర్ సవితా రాణి లక్ష రూపాయల ఆర్థిక సహాయం విరాళంగా అందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు.. అలాగే రమణారెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం ప్రతి ఏటా వారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా 25 వేల ఆర్థిక సహకారం మరియు అన్న ప్రసాదాన్ని అందించడం అలాగే ఎల్లప్పుడూ పిల్లల మంచి చెడుల కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.. స్నేహ సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ సవితారాణి మాట్లాడుతూ స్నేహ సొసైటీ అందిస్తున్న సేవలు చాలా గొప్పవని కొనియాడారు.. అసలు స్నేహ సొసైటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నప్పటికీ వైద్య వృత్తిలో తప్పని పరిస్థితుల్లో అనుకున్నంత సమయం కేటాయించలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు… ఒకటి కాదు రెండు కాదు అందుల పాఠశాల మరియు మానసిక దివ్యాంగుల పాఠశాల అలాగే సఖి సెంటర్ ద్వారా మరియు సెక్స్ వర్కర్ల ఆరోగ్య రీత్యా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో రకాల సేవలు అందజేయడం జరుగుతుందని ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు.. ఈ ఒక్క పాఠశాలలో చదువుకున్న ఒక అంద విద్యార్థిని రజిని తాను చదువుకున్న పాఠశాలకు 50 వేల రూపాయలు ఇవ్వడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం అని కొనియాడారు.. ప్రిన్సిపాల్ జ్యోతి కార్యదర్శి సిద్దయ్య సేవలందిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదనిపిస్తుందని వారు తెలిపారు. స్నేహ సొసైటీ లోని ప్రతి ఒక్క సిబ్బంది సహకారంతోటే తొలుత 1992లో ఏర్పాటు చేసి అంద విద్యార్థుల పాఠశాల ప్రారంభం నుండి ఎన్నో ప్రాజెక్టుల ద్వారా ఎంతోమంది సేవలో భాగ్యస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. అందరితోపాటు స్నేహ సొసైటీ సిబ్బంది సంక్షేమం, ఆర్థికంగా బలోపేతం కావడానికి కోపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం అన్నారు.. ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని సూచించారు.. రానున్న రోజుల్లో తన వంతు సహకారం ఎల్లప్పుడూ స్నేహ సొసైటీకి అందజేస్తానని వారు తెలిపారు.. అలాగే సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ మాట్లాడుతూ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సఖి సెంటర్ లో నా వంతు బాధ్యతగా సేవలు అందించే అవకాశం కల్పించినందుకు స్నేహ సొసైటీ కార్యదర్శి జ్యోతి కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.. అసలు ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదని వచ్చిన తర్వాత ఇక్కడ దివ్యాంగుల పాఠశాలలో చిన్నారులు , వారి ఎదుగుదల వారు రాష్ట్రీయ జాతీయస్థాయిలో రాణించడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం స్థిరపడేందుకు స్నేహ సొసైటీ సిబ్బంది కృషి ఏ విధంగా జరుగుతుందో చాలా విషయాలు తెలుసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు.. నాకు అవకాశం కల్పించిందని సంవత్సరాలు తనవంతు బాధ్యతగా సేవలందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.. టిఐ ప్రాజెక్టు మేనేజర్ శివ మాట్లాడుతూ సెక్స్ వర్కర్లు ట్రాన్స్ జెండర్లు, ఎయిడ్స్ నివారణ ప్రాజెక్టు ద్వారా సేవలందించే దిశగా మరియు వారి ఆరోగ్య రీత్యా భాగోగుల కోసం ఎల్లప్పుడూ కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అసలు స్నేహ టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు ద్వారా ఎన్నో రకాల సేవలు అందించడం జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శాలువలు జ్ఞాపకలతో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు షేర్ల దయానంద్, తాటి వీరేశం, సుధాకర్, స్నేహ సొసైటీ లోని ఆయా ప్రాజెక్టులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

