శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం…

 

బోధన్ ప్రతినిధి,ఏప్రిల్ 25: (ప్రజా గళం)

బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల లో భక్తి శ్రద్దలతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సమిష్టిగా హనుమాన్ చాలీసా చదువుతూ, పాడిపంటలు సమృద్ధిగా పండాలని,వర్షాలు సమయా నికి చల్లగా కురవాలని,ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.ఈ పవిత్ర కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్,పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్,చక్రవర్తి, ఎన్సీపీ శ్రీనివాస్,తదితరులు భక్తితో పాల్గొన్నారు.వారి నాయకత్వంలో విద్యార్థులు,స్థానిక భక్తులు కలిసి భక్తి గీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా మార్చారు.భక్తులంతా”శ్రీ ఆంజనేయ స్వా మి కృపతో గ్రామాలు సస్యశ్యామలంగా మారాలి కోరా రు.ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అని ప్రార్ధనలు చేశారు.ఈ కార్యక్రమం ముగింపులో హనుమాన్ ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరుతూ మంగళహారతులు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.