41 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన తహసీల్దార్,కాంగ్రెస్ నాయకు లు,సర్పంచ్ లు….

 

ఎడపల్లి,ఏప్రిల్ 25: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యా లయంలో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కు లను శనివారం మండల తహసీల్దార్ దత్తాద్రి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్,ఆయా గ్రామాల సర్పంచ్ లతో కలిసి లబ్ధిదారులకు పంపిణి చేశారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు,బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సహకారంతో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందించి పేదింటి ఆడబిడ్డల కు నేను ఉన్నాను అన్న భరోసా ఇచ్చిన మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.మండలంలో మొత్తం 41 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకం మంజూరయ్యాయని తహసీల్దార్ దత్తాద్రి తెలిపారు,ఇందులో 19 మందికి కల్యాణ లక్ష్మి, 22 మందికి షాది ముబారక్ మంజూరు కాగా,లబ్ధిదారు లు అందరికి చెక్కులు పంపిణి చేశామని అన్నారు. మండల కేంద్రంతో పాటు అంబం(వై),ఏఆర్పి క్యాంప్, ధర్మారం,కుర్నాపల్లి,మంగల్ పాడ్,ఎంఎస్సి ఫారం, జైతాపూర్,ఠాణాకలాన్,జాన్కంపేట్,అంబం(వై),పోచారం,నెహ్రూనగర్, గ్రామాల సర్పంచ్ లు కందగట్ల రాంచందర్,గోపరి స్రవంతి సుమన్,వినోద్ కుమార్, సుండు కిషన్,పరిగె సాయిలు,చేపూరి వీణ శ్రీనివాస్ గౌడ్,నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్,నాగుల రాజు గౌడ్, గెంటే అలేఖ్య శ్రీనివాస్,సుంచన కోట అనురాధ కిషన్ గౌడ్,గోపరి స్రవంతి సుమన్,నీరడి జ్యోతి రవికుమార్, ఉపసర్పంచ్ ఇమ్రాన్ ఖాన్ లు తమ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కుల నుతమ చేతుల మీదుగా పంపిణి చేశారు.ఈ కార్యక్ర మంలో ఎంపిడివో శంకర్,ఎంపివో మన్మోహన్ శాస్త్రి, రెవెన్యూ జిపిఓ లు,సంజీవ్,నరేష్, రమేష్,ఆత్మ చైర్మన్ కృష్ణ రావు,కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి శ్రీనివాస్, రత్నాకర్ రెడ్డి, బర్దిపూర్,అశోక్,నవీన్,శివరాం ప్రసాద్, ప్రతాప్ రెడ్డి,అమానుల్లా షరీఫ్,టి.విజయ్ గౌడ్, జహి రుద్దీన్,అశ్వక్,తాహేర్,ఎంబ మోహన్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.