ఆర్మూర్, ఏప్రిల్ 30 ప్రజా గళం
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కాంతి హై స్కూల్ పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం చాటారు. పరీక్ష ఫలితాల్లో విద్యార్థిని,విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు,ప్రిన్సిపాల్ కాంతి

గంగారెడ్డి మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం పాఠశాలకే గర్వకారణమన్నారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ ఉపాధ్యాయినీ,

ఉపాధ్యాయులను శుభాకాంక్షలు తెలిపారు.

పాఠశాల డైరెక్టర్ వేల్పూర్ శశాంక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల పట్టుదల,ఫలితాలు, విజయ పరంపర మరోసారి నిరూపించబడ్డాయని చెప్పారు.కాంతి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని మమ్ము చేయదన్నారు.

