ఆర్మూర్, ఏప్రిల్ 30 ప్రజా గళం
పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన విజయ్ హై స్కూల్ విద్యార్థులు విజయ కేతనం ఎగిరేసారు. విద్యార్థులు
2025-26 సంవత్సరానికిగాను పదో తరగతి పరీక్షల్లో 28 మంది విజయ్ హైస్కూల్ విద్యార్థులు పరీక్షలు రాసి వందశాతం ఉత్తీర్ణతను సాధించారు. మోతె లౌక్య 600 మార్కులకుగాను 536 మార్కులు, మట్టెల సమిక-525 మార్కులు సాధించారు. మిగితా 26 మంది విద్యార్థులు 100 % ఉత్తీర్ణత సాధించగా వీరిలో 7 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించడం గమనార్హం.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తర్ఫీదునిచ్చిన ఉపాధ్యాయ బృందానికి విజయ్ పాఠశాల వ్యవస్థాపకురాలు డా.అమృతలత , కరెస్పండెంట్ కవితాదివాకర్ ప్రిన్సిపాల్ .రమాదేవి అభినందనలు తెలియజేసారు.

