ఆర్మూర్,మే 1:(ప్రజా గళం)
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న ఎన్టీవీ జర్నలిస్ట్ గణేష్ కు అయ్యప్ప పౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు.అయ్యప్ప ఫౌండేషన్ తరపున రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ గాల్ బ్లాడర్ స్టోన్ రిమూవల్ చికిత్స పొందిన జర్నలిస్ట్ గణేష్ గౌడ్ కు చికిత్స జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.ఫౌండేషన్ తరపున జర్నలిస్టులకు అన్నివేళల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయ్యప్ప దయతో త్వరగా కోలుకుని జర్నలిస్టుగా ప్రయాణం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోఫౌండేషన్ వైస్ చైర్మన్ చేపూర్ గణేష్,ఓడ్డెన్న,లింగం,సన్నీ, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్, జర్నలిస్టులు సత్ పుతే శ్రీనివాస్,మాజీ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్, విన్సెంట్, పురుషోత్తం, చరణ్ గౌడ్, నరేందర్, రాజేందర్, సభ్యులు పాల్గొన్నారు.

