గ్రామాలలో ఎన్యూమరేటర్లు,సూపర్ వైజర్లు ప్రతి కుటుంబ వివరాలు సేకరించాలి….ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి సూచన….

 

ఎడపల్లి,మే 8: (ప్రజా గళం)

ఎడపల్లి మండలంలోని గ్రామాలలో ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు నిర్వహించే జన గణన కార్యక్ర మంలో సూపర్ వైజర్లు,ఎన్యూమారేటర్లు ప్రతి ఇంటిని సందర్శించాలని,దీని ద్వారా ప్రతి కుటుంబ వివరాలు సేకరించాలని ఎడపల్లి మండల తహసీల్దార్ దత్తాత్రి సూచించారు.ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో ఎన్యూమరేటర్లు,సూపర్ వైజర్లు ఇంటిం టికి తిరుగుతూ కుటుంబ వివరాలు సేకరించాలని అయన తెలిపారు.ప్రభుత్వం నుంచి వచ్చిన సామాగ్రిని తహసీల్దార్ దత్తాద్రి అధికారులకు అందచేశారు.హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్ లో భాగంగా గ్రామాలను బ్లాక్ లుగా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్లకు ఒక్కో బ్లాక్ను కేటా యించడం జరిగిందని అయన తెలిపారు.ఈ విధంగా సేకరించిన సమాచారంతో వచ్చే ఏడాదిలో జనగణన నిర్వహించడం జరుగుతుందన్నారు.దీనికి ప్రజాప్రతి నిధులు,సర్పంచులు,మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు సహకరించాలన్నారు.ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి శివలింగ్ గాలప్ప,ఏఎస్ఓ ఇందు, సర్వేయర్ అరుణ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.