బోధన్ ప్రతినిధి,మే 9: (ప్రజా గళం)
బోధన్ పట్టణంలో సాయి ఆదర్శ యువతి మండలి ఆధ్వర్యంలో శనివారం మహారాణా ప్రతాప్ 486వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సాయి ఆదర్శ యువతి మండలి అధ్యక్షురాలు పద్మ సింగ్ మహారాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా పద్మసింగ్ మాట్లాడుతూ.. మహారాణా ప్రతాప్ మే 9, 1540 సంవత్సరంలో కుంభాల్గల్లో ఉదయ్ సింగ్ జీవం త్ బాయిలకు జన్మించారు అని తెలిపారు.మహారాణా ప్రతాప్ సింగ్ మే వార్ సింహాసనాన్ని అధిష్టించే నాటికి పరిస్థితి దయనీయంగా ఉంది అని,నలువైపులా శత్రు వులు పొంచి ఉన్నారని,లక్షల సంఖ్యలో శత్రువుల సైన్యం ఉందని,రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మహా రాణా ప్రతాప్ సింగ్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపో యింది అని స్పష్టం చేశారు.ఆయనను ప్రజారాజగా పరిగణించబడుతున్నారని,ఆయన ఏడు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు,110 కిలోల బరువు ఉండేవా రు అని అన్నారు.ఆయన కవచం 72 కిలోలు,ఈట 81 కిలోలు ,అలాగే దాలు,రెండు ఖడ్గాలు కలిపి మొత్తం 200 కిలోల బరువు ఉండేవి,రాణా ప్రతాప్ శత్రువులకు ఏనాడూ తలవంచలేదు అని ఆమె స్పష్టం చేశారు. ఆయన గుర్రం పేరు చేతక్ హల్దీ ఘాటు యుద్ధంలో గాయపడి యజమాని రక్షించి తన ప్రాణాన్ని విడిచింద ని,దేశం ధర్మం సంస్కృతి స్వాతంత్రం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన మహారాణా ప్రతాప్ సింగ్.అని పద్మ సింగ్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో మదన్ సింగ్,రాజేందర్ సింగ్,గోపి సింగ్,అక్షయ్ సింగ్, రన్వీర్ సింగ్,లోకేష్ సింగ్,అన్విత్ సింగ్,విజయ్ సింగ్, రత్నకుమారి,పూజ,భాగ్య,అనీఫా,ఖాజాబీ,స్థానికులు పాల్గొన్నారు.

