ఎరాజ్ పల్లి కమాన్ వద్ద ఆటో”ఢీ”కొని కండక్టర్ కు తీవ్ర గాయాలు….

 

 

బోధన్ ప్రతినిధి,మే 12: (ప్రజా గళం)

బోధన్ మండలం ఎరాజ్ పల్లి కమాన్ వద్ద ఆటో,బైక్” ఢీ”కొన్న ఘటనలో కందకుర్తి గ్రామానికి చెందిన కండక్ట ర్ తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికుల కథనం ప్రకారం రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన నట్కర్ యాదూ ఏరాజ్ పల్లి నుండి బోధన్ కు బైక్ పై వస్తుండ గా,ఆటో అతివేగంగా వచ్చి అతనిని”ఢీ” కొట్టింది. దాంతో అతని కుడికాలు విరిగింది.స్థానికులు గమనిం చి 108 ఆంబులెన్స్ కు సమాచారం అందించగా..సకా లంలో స్పందించి ఘటన స్థలానికి చేరుకున్న బోధన్ 108 ఆంబులెన్స్ సిబ్బంది ఈఎంటి లక్ష్మణ్, పైలట్ జావిద్ ప్రథమ చికిత్స చేసి బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని వైద్యులు అలాగే కుటుంబ సభ్యులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.