నిజామాబాద్ మే 15 (ప్రజా గళం ప్రతినిధి)
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో బీజేపీ కి చెందిన మరో నేతపై ఓ మహిళ బాధితురాలు ఫిర్యాదు చేసింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ డివిజన్ కార్పొరేటర్ గా టికెట్ ఇప్పిస్తానని బీజేపీ నాయకుడు బుస్సాపూర్ శంకర్ లక్ష రూపాయలు తీసుకున్నట్లు బాధితురాలు పార్టీ జిల్లా అధ్యక్షునికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం బాధితురాలు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు కాపీని చర్యల నిమిత్తం రాష్ట్ర కమిటీకి పంపిస్తానని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు బాధితురాలి కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ పార్టీ తరపున టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకొని న్యాయం చేయలాని 49 వ డివిజన్ కు చెందిన మిర్యాల్కర్ గీత జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి కీ పిర్యాదుచేశారు.49 వ డివిజన్ నుండి కార్పొరేషన్ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ వచ్చినందున,పోటీ చేయాలని భావించింది . ఆ సమయంలో బీజేపీ పార్టీ నాయకులు బుస్సాపురం శంకర్ పరిచయం కావడంతో,అతను తన వద్దకు వచ్చి మీరు 49వ డివిజన్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారా, మీకు బీజేపీ పార్టీ నుండి టికెట్ ఇప్పిస్తాను, అందుకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారన్నారు., నేను అతని మాటలు నమ్మి, అతనికి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించా నన్నారు . అంతేకాకుండా ప్రచారానికి కారు కు, ఫ్లెక్సిలు, వాల్ పోస్టర్, నమూనా బ్యాలెట్కు అదనంగా డబ్బులు తీసుకున్నాడన్నారు . నీకు టికెట్ వచ్చినట్లేనని నమ్మబలికాడన్నారు. నామినేషన్ల గడువు ముగిసే వరకు నాకు ఏదో ఒక సాకు చెప్పి కాలం గడిపడన్నారు . ఆతర్వాత చివరి క్షణం వరకు వేచి చూసిన తనకు టికెట్ రాలేదని, ఇతరులకు టికెట్ కన్ఫాం అయిందని తెలిసిందన్నారు.. అతను నాకు మోసం చేయడం వలన నేను పార్టీ నుండి పోటీ చేయలేదు, చివరికి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి వీలు లేకుండా బుస్సాపురం శంకర్ నాకు కాలయాపన చేసి మోసం చేశాడాన్నారు . అతను కోరిన విధంగా సర్టిఫికేట్ కాపీలు ఇచ్చనన్నారు.. ఈ హడావిడిలో నా ఓరిజినల్ పదవ తరగతి సర్టిఫికేట్ పోయిందన్నారు. దీంతో నేను చెల్లించిన మొత్తం రూపాయలను నాకు ఇవ్వాలని అడిగితే అతను, రేపు మాపు అంటూ కాలం సాగదీస్తున్నాడన్నారు . గత కొన్ని రోజుల క్రితం నేను గట్టిగా నిలదీసి నా వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించమని అడిగితే నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకపోఅని బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా ఇట్టి విషయం ఎక్కడ చెప్పినా నా అంతు చూస్తానని బుస్సాపురం శంకర్, అతని తమ్ముడు ఇద్దరు కలిసి నన్ను బెదిరిస్తున్నారన్నారు.ఎక్కడ కలిసిన అవమానకరంగా బూతు మాటలు తిడుతున్నారని,నా వద్ద డబ్బులు తీసుకొని నాకు పార్టీ తరపున టికెట్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేయడమే కాకుండా, డబ్బులు అడిగినందుకు నన్ను బూతు మాటలు తిట్టి, అంతు చూస్తానని బెదిరించిన బుస్సాపురం శంకర్ పై చట్టరీత్య చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తనను మోసం చేసిన బుస్సాపూర్ శంకర్ పై సంబంధిత రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా అధ్యక్షుడితో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త కు సైతం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

