నిజామాబాద్ వైద్య విభాగం జూన్ 12 ( ప్రజా గళం )
వైద్య సేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ సూచించారు.
నిజామాబాద్ పట్టణంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి బి రాజశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రo లోఉద్యోగుల హాజరు రిజిస్టర్ ను, ఓపి రిజిస్టర్ ,మందుల స్టాకు రిజిస్టర్ ను, రిపోర్టులను తనిఖీ చేశారు. వ్యాక్సిన్ లను నిల్వచేసే ఐఎల్ఆర్ లో ఉష్ణోగ్రతలను రికార్డు చేయాలని అన్నారు. అనంతరం సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాల లోపు రిజిస్ట్రేషన్ చేయాలని వారిలో ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను హైరిస్తూ గర్భిణీలుగా గుర్తిస్తూ ప్రత్యేకంగా ప్రసవ ప్రణాళిక రచించాలన్నారు. ఉద్యోగులందరూ సమయపాలన పాటించి సమయానికి హాజరుకావాలని, నియమ నిబంధనలు ఉల్లంఘించి విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులకు శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉపకేంద్ర పరిధిలో కేటాయించినటువంటి లక్ష్యాలను 100% పూర్తి చేయాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని కోరారు. వారం తిరిగేలోపు అసంపూర్తి రికార్డులన్నింటినీ పూర్తిచేయాలని, ఆరోగ్య కేంద్ర o లో పరిశుభ్రత పాటించాలని, హెచ్చరించడం జరిగింది. తనిఖీ సమయంలో వైద్యురాలు డాక్టర్ కీర్తి,
నర్సింగ్ ఆఫీసర్ లు నేహా, అర్చన ఉన్నారు.

