బోధన్ ప్రతినిధి,జూన్ 14: (ప్రజా గళం)
తెలంగాణ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలు అవసరం లేదని,వాటిని నాలుగు వేల పాఠశాలకు తగ్గి స్తామంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని అలా గే అప్రజాస్వామికం అని తెలంగాణ పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి అన్నారు.ఈ మేరకు అయన ఆదివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.అందరికీ విద్యా వైద్యం అందించాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉందని,కానీ విద్యా వ్యాపారమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 వేల ప్రవేట్ పాఠశాలలో 66% మంది విద్యార్థులు చదువుతుంటే మరి 27 వేల ప్రభుత్వ పాఠశాలలో 34% విద్యార్థులు చదువుతున్నా రు,అంటే దీనికి కారణము ప్రభుత్వ బడులకు నిధులు కేటాయించ కుండా, మౌలిక వసతులు కల్పించకుండా నిర్వీర్యం చేయడమే అని పేర్కొన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుంది కాబట్టి బడుల మూసివేత పై ముఖ్యమంత్రి పునారాలోచన చేయాలని, విద్యకు 20% నిధులు కేటాయి స్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్య రంగాన్ని కాపాడాలని పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షు లు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.అల్పాహారం పథకం మంచి నిర్ణయమని ఆయన తెలిపారు.

